జిల్లాకో ఉద్యోగం అయినా ఇచ్చిండ్రా?

జిల్లాకో ఉద్యోగం అయినా ఇచ్చిండ్రా?

పోలీస్ రికృట్ మెంట్ మినహా రాష్ట్రంలో ఏ నియామకం జరగలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సింగరేణి, విద్యుత్ శాఖ లెక్కలు చెప్పడం తప్ప ప్రభుత్వం చేసింది ఏం లేదన్నారు. నూతన జిల్లా ఏర్పాటు చేసి జిల్లాకో ఉద్యోగం అయినా ఇచ్చిండ్రా? అంటూ కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించారు. మూడేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి  పైసా ఇవ్వలేదని ఆరోపించారు. బడ్జెట్ లో పేర్కొన్న ఊసే లేదన్నారు జీవన్ రెడ్డి. యువజన కాంగ్రెస్ పిల్లలను నిర్భందిస్తున్న పోలీసులారా మీరేమన్నా ఆలోచించుకుంటున్నారా? స్థానికతకు విరుద్ధంగా 317 జీవో జారీ చేస్తున్న వైనంపై పోలీసులు ఆలోచన చెయ్యాలన్నారు. తన ప్రజా జీవితంలో మీడియపై ఆంక్షలు విధించిన ఉధంతం చూడలేదన్నారు. మీడియా స్వేచ్ఛ కు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహారిస్తున్నారన్నారు.

స్థానికత అనేది ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగులు వివక్షతకు గురవుతున్నారన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వీటన్నిటిని నిరసిస్తే అరెస్ట్ లతో అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు కార్యక్రమం చేపడితే రాత్రి నుంచి అరెస్ట్ లు చేయడం ఎక్కడి న్యాయమన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తే అరెస్ట్ లు చేయడంలో తెలంగాణ రాష్ట్రమే ఒక ఉదాహరణగా మిగిలిందన్నారు. ఉద్యమాలతో  సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి నిర్భంధం దురదృష్టకర పరిణామమని పేర్కొన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు.

యువజన కాంగ్రెస్ నేతలు ఏ త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జీవన్ రెడ్డి. ఏ లక్ష్యాల కోసం రాష్ట్ర తెచ్చుకున్నామో వాటి సాధన కోసం  మరో పోరాటం కొనసాగాలన్నారు. ఉన్నోడి కోసమే బంగారు తెలంగాణ... పట్టెడు అన్నం పెట్టే తెలంగాణ కావాలన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కాంక్షించే తెలంగాణ కావాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే తెలంగాణ కావాలన్నారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో 70 శాతం తెలంగాణేతరులే ఉన్నారు. కేవలం 10% కూడా తెలంగాణ వారికీ ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.  ఆంధ్రాలో స్థానికత అమలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు నిరాశకు లోను కావద్దన్నారు. 

ఇవి కూడా చదవండి:

మరో కొత్త వైరస్​.. నియోకొవ్​

మార్కెటింగ్ ఉద్యోగులపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్