ప్రభుత్వం కోటి రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలి

ప్రభుత్వం కోటి రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలి

సింగ‌రేణి ఓపెన్ కాస్ట్ పేలుడు సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతుంద‌న్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బ్లాస్టింగ్ జరిగే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమ‌న్నారు. ఓసిపి(ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ) ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులను గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి లో ఆయ‌న పరామర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులనే నెపంతో కార్మికుల హక్కులను సింగరేణి యాజమాన్యం కాలరాస్తుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినందున‌ బాధిత కుటుంబాలని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేన‌న్నారు

పక్క రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే అక్కడి ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించిందన్న జీవన్ రెడ్డి.. అదే విధంగా ఇక్కడా ఇవ్వాలన్నారు. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలన్నారు. సంఘటన జరిగినప్పటి నుండి కార్మిక సంఘాల నాయకులు చర్చల కోసం ఎదురు చూస్తుంటే యాజమాన్యం రాకపోవడం సరైంది కాదని అన్నారు.