జిల్లా కలెక్టర్లకు బాధ్యత లేదా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జిల్లా కలెక్టర్లకు బాధ్యత లేదా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తన ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్ అధ్యక్షులకు సైతం నిధుల కేటాయింపు లేకపోవడంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు.

రైతు వేదికలు నిర్మించాలంటూ ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్లకు బిల్లులు చెల్లించడంలో బాధ్యత లేదా..? జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయంకూడా లేని గ్రామ పంచాయతీలకు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేయించడంతో వాయిదాలు కట్టలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.