మద్యం వల్ల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మద్యం వల్ల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని..విస్మరించిన వాగ్దానాలు తెరమీదకు రాకుండా మాయ చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే గీత కార్మికులకు సంబంధించి కేసీఆర్ ప్రకటనను తెర మీదకు తెచ్చిండన్నారు. మద్యం వలన ప్రజల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం అవుతున్నాయని మండిపడ్డారు. 

గీత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తే.. ముందు మీరు బెల్ట్ షాపులను మూసి వేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గీత కార్మికుల పొట్ట కొట్టడానికి పోలీసులు కల్లు మండపాల వద్ద బ్రీత్ అనలైజర్లు పెడుతున్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఎన్నో బెల్ట్ షాప్ లు ఉన్నాయి.. అవి 24 గంటలు నడుస్తున్నాయని మండిపడ్డారు. మద్యం అమ్మకాల వలన గీత కార్మికుల వృత్తి అధ్వానంగా మారిందని.. ఒక్క వర్గానికి కాకుండా లో ప్రయార్టీ లైన్ ద్వారా అన్ని వర్గాల వారికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.