
మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నందుకు సానుకూలంగా స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్ లో పోటి చేయడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి కవిత సేవలు అవసరం ఉన్నాయి కాబట్టే మళ్ళీ తిరిగి సేవలు చేయడానికి ముందుకు వస్తుందన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమెకు ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పిన జీవన్ రెడ్డి.. ప్రజా ప్రతినిధులు ఓడిపోవడం అనేది వారిని మరింత బాధ్యతాయుతుల్ని చేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల నుండి పోటీ చేసి కవిత మరింత మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.