రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీ కృష్ణ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీ కృష్ణ
  • ఖిలావనపర్తి జాతరలో కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్‌‌ గడ్డం వంశీ కృష్ణ

ధర్మారం, వెలుగు : లక్ష్మీనారసింహుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అప్పుల ఊబి నుంచి బయటపడాలని పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్‌‌ గడ్డం వంశీకృష్ణ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తిలో శుక్రవారం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి ప్రభుత్వ విప్‌‌ అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌తో కలిసి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వంశీక-ష్ణను, లక్ష్మణ్‌‌కుమార్‌‌కు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌‌ ఇచ్చిన మిగతా గ్యారంటీలు సైతం త్వరలోనే అమలు అవుతాయన్నారు. అనంతరం స్థానిక నాయకులు సంతోష్‌‌, మోతె రవి, అశోక్‌‌ ఇంటికి వెళ్లి భోజనాలు చేశారు. మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కాడె సూర్యనారాయణ, కొడారి అంజయ్య, కోమటిరెడ్డి రవీందర్‌‌రెడ్డి, ప్రదీప్‌‌రెడ్డి, జగన్‌‌మోహన్‌‌రెడ్డి, కొత్త నరసింహులు పాల్గొన్నారు.