పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే.. ఇండస్ట్రీస్ తీసుకొస్తా.. జాబ్స్ ఇప్పిస్తా: గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే.. ఇండస్ట్రీస్ తీసుకొస్తా.. జాబ్స్ ఇప్పిస్తా:  గడ్డం వంశీకృష్ణ
  •     ఉద్యోగాల పేరిట కేసీఆర్, మోదీ యువతను మోసం చేశారు: గడ్డం వంశీకృష్ణ
  •     తాను సొంతంగా పరిశ్రమ పెట్టి 500 మందికి ఉద్యోగాలు కల్పించానని వెల్లడి 
  •     వంశీ సొంత బిడ్డ అనుకొని గెలిపించండి: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి
  •     ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలో కాంగ్రెస్ యువ సమ్మేళనం 

మంచిర్యాల/పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ప్రభుత్వరంగ పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ చైర్ పర్సన్ కె.సురేఖ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని​ ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కాంగ్రెస్ యువ సమ్మేళనం కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. నియోజకవర్గం నుంచి యువకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను మోసం చేశారు. 

సింగరేణిని కేసీఆర్ ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోగా, మోదీ గ్యాస్, ఆయిల్ రంగాలను అదానీ, అంబానీలకు అమ్ముకున్నారు. సింగరేణి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంట్రాక్టు ఉద్యోగాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకున్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో డిగ్రీలు, పీజీలు చదివిన యువకులు ఉపాధి హామీ పనులకు పోతున్నారు. నేను సొంతంగా కంపెనీ పెట్టి ఈ ప్రాంతానికి చెందిన 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని మా తాత కాకా వెంకటస్వామి చెప్పారు. అదే బాటలో నడుస్తున్న”అని వంశీకృష్ణ అన్నారు. గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 13 ఎంపీ సీట్లు ఇచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. దోపిడీ రాజకీయాలు చేసే నాయకులు మనకొద్దని, సేవ చేసే వాళ్లను గుర్తించి గెలిపించాలని ఆయన కోరారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు: వివేక్ వెంకటస్వామి 

ఈ ఏడాదిలో రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెన్నూరు​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పారన్నారు. ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల చొప్పున పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ యువతకు స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ట్రైనింగ్ కోసం ఏటా రూ.లక్ష ప్రకటించారని గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఇక్కడే జాబ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ‘‘అదానీ, అంబానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు. వాళ్లను ప్రపంచంలోనే ధనికులను చేసిన్రు. రూ.125 లక్షల కోట్ల అప్పులు చేసి దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. దేశంలోని బడా పెట్టుబడిదారులకు రూ.16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారు’’అని వివేక్ విమర్శించారు. పెద్దపల్లి ప్రజలు కాకా వెంకటస్వామిని, తనను ఆదరించినట్టే.. ఇప్పుడు వంశీకృష్ణను సొంత కొడుకు, తమ్ముడిగా భావించి ఎంపీగా గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అను బంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​తో కలిసి విజయరమణారావు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసి.. కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి, కనీసం 2 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ సమస్య కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. వంశీకృష్ణను కలిసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించినట్లే, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, పార్టీ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా, రైలు ప్రమాదంలో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పెరిక లింగయ్య (55) మృత దేహానికి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.

దసరాలోపు ఇండస్ట్రియల్ పార్క్: ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు 

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. దసరా పండుగలోపు మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మంచిర్యాలను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో వంశీకి లక్ష మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్ పర్సన్ సురేఖ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, సురిమిళ్ల వేణు, టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేశ్, నాయకులు చిట్ల సత్యనారాయణ, సిరిపురం రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.