
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్...కల్లు తాగిన కోతిలా తయారైండని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడని కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. " ఎవరో ఒకరు అత్యుత్సాహంతో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ కాళ్లు కడిగి ఉండొచ్చు.
దానికి తెలంగాణ మహిళల ఆత్మగౌరవం ఏమైందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ.. సోనియాకు ట్వీట్ చేయడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన లక్షల కోట్ల డబ్బులతో యూట్యూబ్ ఛానెల్స్ ను నడుపుతున్న కేటీఆర్.. మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుండు" అని మండిపడ్డారు.నల్గొండ జిల్లాలో మంత్రులతో ఎంపీలకు సమన్వయం లేదనడం సరైంది కాదన్నారు.