
- ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి: చామల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. దానిపై విష ప్రచారం చేయడం బావ, బామ్మర్దులకు అలవాటుగా మారిందని హరీశ్, కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అధికారం కోల్పోయాక ఈ ఇద్దరు నేతలు ప్రతిపక్ష పాత్రను పూర్తిగా విస్మరించి, రేవంత్ సర్కార్ పై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
మెట్రోకు సంబంధించిన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి.. యూరియా, లిక్కర్‌కు లింక్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ కంపెనీని రేవంత్ బెదిరిస్తున్నారని కేటీఆర్ విష ప్రచారం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తెలంగాణలో లిక్కర్ ను ఏరులై పారిస్తుందని హరీశ్ విమర్శిస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.