మహిళలతో బతుకమ్మ ఆడిన రాహుల్, రేవంత్

మహిళలతో బతుకమ్మ ఆడిన రాహుల్, రేవంత్

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బతుకమ్మ ఆడారు. మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లిలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, జైరాం రమేశ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం బతుకమ్మ ఆడుతూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా చేసుకునే సంప్రదాయ పండుగ బతుకమ్మ. అంత గొప్ప చరిత్ర ఉన్న బతుకమ్మ ఆటను మహిళలతో సమానంగా రాహుల్ గాంధీ ఆడడం అందర్నీ ఆకట్టుకుంది. 

అంతకు మునుపు ఇదే తరహాలోలో ఖమ్మం జిల్లా ఆదివాసీలతో కలిసి రాహుల్ గాంధీ కొమ్ము కోయ డ్యాన్స్ చేశారు.  స్త్రీ, పురుషులు కలిసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో సాగుతూ అందర్నీ అలరించారు. ఇలా భారత్ జోడో యాత్రను ముందుకు నడిపిస్తూ పార్టీ శ్రేణుల్లో రాహుల్ ఉత్సాహం నింపుతున్నారు. యాత్రలో పాల్గొంటూనే.. మార్గ మధ్యలో ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్రను సాగిస్తున్నారు.