రాష్ట్రపతి విందుకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రపతి విందుకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉత్తమ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వర్తించిన సైనికాధికారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి చాలా మంది తాజా, మాజీ సైనికాధికారులు హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం  గ్రూప్ ఫోటో దిగారు. 1994 లో కాంగ్రెస్ లో చేరక ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి భవన్ లో ఏడీసీ అండ్ కంట్రోలర్ గా పని చేశారు. అంతకు ముందు ఆర్మీ పైలట్ గా పని చేశారు.