టీఆర్ఎస్ దాడుల గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తా

టీఆర్ఎస్ దాడుల గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తా

సూర్యాపేట: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పక్ష పార్టీ నాయకులపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ లో కోరతానని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేకుంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.