ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది : ఎంపీ గడ్డం వంశీ

ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది : ఎంపీ గడ్డం వంశీ

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట యేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులకు  ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7  లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు.  గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫీ చేశాయని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమణారావు, మక్కన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.