నిరుద్యోగ సమస్యలపై అక్టోబర్ 2 నుండి కాంగ్రెస్ పోరాటం

నిరుద్యోగ సమస్యలపై అక్టోబర్ 2 నుండి కాంగ్రెస్ పోరాటం

ఒకవైపు ధరల పెరుగుదల, వరదలపై పోరాటం చేస్తూనే.. మరో పోరుకు సిద్ధమయ్యామని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తొలిదశ, మలిదశ తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడింది యువతేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్యలపై అక్టోబర్ 2 నుండి  పోరాటం చేస్తుందన్నారు. యువత కోసమే మా పోరాటం.. ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం మా ఉద్యమని చెప్పారు. మధ్య యుగం లో రాచరిక పాలన చేసిన రాజుల తరహాలో కేసీఆర్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టనున్న పోరాటం  డిసెంబర్ 9వరకు కొనసాగుతుందన్నారు. 

తెలంగాణ తల్లి ప్రగతి భవన్ లో బందీ అయ్యిందన్న రేవంత్ రెడ్డి..తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికి తెలంగాణ అమరుల కుటుంబాలను, నిరుద్యోగులను కలుపుకొని పనిచేస్తామన్నారు. ఉద్యమసమయంలో హరీశ్ రావు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకున్నాడు... కానీ ఆయనకు ఆ రోజు అగ్గిపెట్టె దొరకలే.. కానీ తెలంగాణ యువత ఉద్వేగానికి లోనైన రాష్ట్రం కోసం ప్రాణాలు బలిచ్చారని గుర్తు చేశారు. శ్రీకాంతచారి మలిదశలో తొలి అమరుడయ్యడని తెలిపారు.