ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల... పులివెందులపై సస్పెన్స్

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల... పులివెందులపై సస్పెన్స్

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టగా కాంగ్రెస్ ఈ రేసులో కాస్త వెనుకబడి ఉంది. ఏపీలో వైసీపీ సర్కార్ ని గద్దె దించటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్ సభ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్.

 

లోక్ సభ అభ్యర్థుల విషయానికి వస్తే, ముందు నుండి ప్రచారం జరిగినట్లుగానే కడప ఎంపీ స్థానానికి షర్మిల పేరును ప్రకటించింది కాంగ్రెస్. కాకినాడ నుండి పల్లం రాజు, రాజమండ్రి నుండి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలం, కర్నూలు నుండి పీజీ రాంపుల్లయ్య యాదవ్ లోక్ సభ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాధ్ శింగనమల నుండి, కుప్పం నుండి ఆవుల గోవిందరాజు, పిఠాపురం నుండి మేడే సత్యానందరావు, బరిలో ఉండగా, ఇటీవలే వైసీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు వారివారి నియోజకవర్గాల నుండే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. అయితే, పులివెందులకు అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

ALSO READ :- హెల్త్ క్యాంప్ పెట్టిన నకిలీ వైద్యులు.. పోలీసులు వచ్చేసరికి పరార్