కేటీఆర్ పర్యటిస్తే అరెస్టులు చేస్తరా

కేటీఆర్ పర్యటిస్తే అరెస్టులు చేస్తరా

వీర్నపల్లి, వెలుగు : సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించినప్పుడల్లా పోలీసులు ప్రతిపక్ష నాయకులను ఇండ్లలో నుంచి తీసుకువెళ్లి నిర్బంధించడం కరెక్ట్ కాదని వీర్నపల్లి మండల కాంగ్రెస్ నాయకులు బొంగు తిరుపతి, భూత శ్రీనివాస్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో  శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్​ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే లాఠీఛార్జీ చేస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం ఏమైనా కల్లోలిత ప్రాంతమా అని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనార్ధన్, రాజు, సంగు నాయక్, లింబ్యా నాయక్, నర్సయ్య, రాంచంద్, కాంతయ్య, రమేశ్​తదితరులు పాల్గొన్నారు.  

గంభీరావుపేట, వెలుగు: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, మంత్రి కేటీఆర్​దృష్టికి ప్రజా సమస్యలు తీసుకవెళ్లడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమిద్ అన్నారు. ముస్తాబాద్ లో శుక్రవారం మంత్రి కేటీఆర్​పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడాన్ని నిరసిస్తూ గంభీరావుపేటలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం  మంత్రి కేటీఆర్​దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పర్సరాములు, నాయకులు ప్రభాకర్, తాహెర్, శ్రీనివాస్ , ఎల్లయ్య, సురేశ్​, గంగి స్వామి, ప్రశాంత్, తాజుద్దీన్ , రాజు, భాస్కర్ పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు భయపడే నీకు పదవెందుకు..?

తంగళ్లపల్లి, వెలుగు: ప్రజలకు ఇచ్చిన అమలుకు నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని, ప్రతిపక్షాలకు భయపడే కేటీఆర్​మీకు మంత్రి పదవి ఎందుకని కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ అన్నారు. మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ లీడర్లను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. శనివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, పట్టణ అధ్యక్షుడు నర్సింహ గౌడ్, కిసాన్​ సెల్ అధ్యక్షులు పరుశురాం, రవి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చుక్క శేఖర్ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట,వెలుగు: మంత్రి కేటీఆర్​పర్యటన సందర్భంగా కాంగ్రెస్​లీడర్లు, విలేకర్లపై లాఠీఛార్జి చేయడం కరెక్ట్​కాదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దోమ్మట నర్సయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  నాయకులు షేక్ గౌస్, సద్ది లక్ష్మారెడ్డి, దేవయ్య, రాజేందర్, నాగరాజు, బుచ్చ గౌడ్, రామ్ రెడ్డి పాల్గొన్నారు.