కేటీఆర్తో చర్చకు రెడీ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

కేటీఆర్తో చర్చకు రెడీ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ తో అన్ని విషయాలు చర్చించేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తెలిపారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్ స్థాయికి పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వస్తారని చెప్పారు. 

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రజా సమస్యలపై కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. రోడ్లపై చర్చించేందుకు కేటీఆర్ ఏమైనా సర్పంచా అని ప్రశ్నించారు. తెలంగాణ అనేది కేసీఆర్ ఒక్కడి పోరాటంతో రాలేద ని, తాము కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు.