
న్యూఢిల్లీ:'నరేందర్ సరెండర్' పేరుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తన విమర్శలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫేమస్ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) రెడ్ క్యాప్‌ను పోలిన క్యాప్‌ను రూపొందించింది. దానిపై 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' బదులు 'నరేందర్ సరెండర్' అని రాసి మీమ్‌గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ట్రంప్ ఫోన్ చేయగానే ప్రధాని మోదీ పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించారని.. అమెరికా ఒత్తిడికి ఆయన లొంగిపోయారని ఈ మీమ్‌తో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. కాగా, దీని పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మోదీ నాయకత్వంలో టెర్రరిజానికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని, నిజానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజలు పాక్ ఏజెంట్ లా చూస్తున్నారని బీజేపీ నేత ప్రదీప్ భండారీ అన్నారు.