అలా చేస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా..

అలా చేస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా..

తనను సస్పెండ్ చేస్తే రోజుకో బండారం బయట పెడతానని హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అశోక హోటల్ లో కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రత్యేక సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. షోకాజ్ నోటీస్ ఇస్తే తాను  సమాధానం చెబుతానన్నారు.  తనను  సస్పెండ్ చేసినా అధిష్టానానికి విధేయుడిగా ఉంటానన్నారు.  రేవంత్  తన సవాల్  స్వీకరిస్తే  తాను రాజీనామ చేస్తానన్నారు. తన స్థానంలో  అభ్యర్థిని పెట్టీ గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానన్నారు. తాను గెలిస్తే తాను హీరోనని.. ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోలమన్నారు.  రేవంత్ పార్టీ సిద్ధాంత ప్రకారం  పని చేయడం లేదన్నారు. రేవంత్ పర్సనల్ షో చేస్తున్నారన్నారు. అందుకే  తాను కూడా పర్సనల్ షో చేస్తున్నాన్నారు.  వీహెచ్ తన కూతురు సమస్యపైవి మంత్రి హరీష్ రావు ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ సోనియాగాంధీకి వ్యతిరేకం కాదన్నారు.  పార్టీ ఎప్పటికైనా రాహుల్ గాంధీ,సోనియాగాంధీలదేనన్నారు.