కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం

కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం

లోక్ సభ ఎన్నికల ఓటమితో… కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. కర్ణాటక ప్రచార కమిటీ అధ్యక్షుడు H K పాటిల్ రాజీనా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ఓటమికి నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. పరిస్థితిపై పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు పాటిల్.

ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయ్ కూడా రాజీనామా చేశారు. ఒడిశాలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ ఒక్క సీటులో మాత్రమే గెలవగలిగింది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యతగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు నిరంజన్ పట్నాయక్. ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ కూడా రాజీనామా చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా కూడా రాజీనామా చేశారు.