ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్​ థర్డ్​లిస్ట్​!.. నోటిఫికేషన్​కు ముందే ఇచ్చే ఛాన్స్

ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్​ థర్డ్​లిస్ట్​!.. నోటిఫికేషన్​కు ముందే ఇచ్చే ఛాన్స్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ మూడో లిస్టు ఒకట్రెండు రోజుల్లో రిలీజ్​అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై కసరత్తులు చేస్తున్నది. 19 స్థానాలు పెండింగ్​లో ఉండగా.. అందులో నాలుగు స్థానా లు కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించనుంది. వారి సీట్లపై ఇప్పటికీ అధిష్టానం ఏమీ తేల్చకపోవడం, ఇచ్చిన సీట్లపై వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో సీట్ల సర్దుబాటుపై పీఠముడి పడింది. వామపక్షాలతో పొత్తు అంశం మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. మిగతా సీట్లపైనా ఈ రెండు రోజుల్లోనే ఏదో ఒకటి డిసైడ్​చేసి లిస్ట్​రిలీజ్ చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నట్టు చెప్తున్నారు. నోటిఫికేషన్ ​డేట్​కన్నా ముందే మొత్తం అభ్యర్థులను ప్రకటించేస్తే వీలైనంత తొందరగా నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారంలోకి దిగిపోయేందుకు చాన్స్​ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మిగతా అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసి లిస్టును ప్రకటించాలని చూస్తున్నారు.

ఏఐసీసీ ప్రతినిధులు నెల రోజులిక్కడే..

ఎన్నికల సరళి పర్యవేక్షణకు ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల​వారీగా అబ్జర్వర్లను నియమించిన హై కమాండ్.. వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రెస్​మీట్లు, కమ్యూనికేషన్ల కోసం ఏఐసీసీ అధికార ప్రతినిధులనూ రాష్ట్రానికి పంపింది. కమ్యూనికేషన్​ ఇన్ చార్జిగా అజయ్​ కుమార్​ ఘోష్​ను నియమించగా.. తాజాగా ఇద్దరు స్పోక్స్​ పర్సన్లనూ పంపింది. వారు నెల రోజుల పాటు ఇక్కడే ఉండి కమ్యూనికేషన్​విభాగం బాధ్యతలను చూసుకోనున్నారు.