బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భేటీ అనంతరం నేతలు నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినందుకు 12 మంది ఎమ్మెల్యేలకు చేకూరిన రాజకీయ, ఆర్థిక లబ్ది గురించి కాంగ్రెస్ తన ఫిర్యాదులో సవివరంగా ప్రస్తావించనుంది. బీఆర్ఎస్ వారిని ఎలా ప్రలోభాలకు గురిచేసిందన్న విషయాన్ని కంప్లైంట్ వివరించనుంది. ఫాం హౌస్ కేసుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగుతున్న సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.