తమిళనాడులో ఇండియా కూటమి సీట్లపై క్లారిటీ

తమిళనాడులో ఇండియా కూటమి సీట్లపై క్లారిటీ

తమిళనాడులో ఇండియా కూటమి ఎంపీ సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఇందులో 21 స్థానాల్లో అధికార డీఎంకే పోటీ చేయనుంది. కాంగ్రెస్ 10, సీపీఐ2, సీపీఎం 2, VCK 2, MDMK 1, IUML 1, KMDK 1 స్థానంలో బరిలోకి దిగనున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజోయ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌తో డీల్‌ను ఖరారు చేశారు.  సీట్ల ఒప్పందం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ 40 సీట్లలో ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ :- కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదని  మక్కల్‌ నీది మయం పార్టీ చీఫ్  కమల్ హాసన్ ప్రకటించారు.  ఈరోజు ఉదయం సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కమల్‌ హాసన్‌ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్..  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ  చేయకుండా అధికార డీఎంకేకు మద్దతు ఇస్తున్నట్లుగా వెల్లడించారు.  దీంతో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్‌ఎం పార్టీ ప్రచారం చేయనుంది.