కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఉద్యమాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఉద్యమాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరెంటు బిల్లుల పెంపు, ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నాటకాలపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ కార్యవర్గ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ఆయన.. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని అన్నారు. పార్టీ ముఖ్య నేతలు గ్రామాల్లో పర్యటించి సమస్య తీవ్రతను బట్టి పోరాటాలను విస్తృతం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నెల రోజుల పాటు వరుస ఉద్యమాలు చేసి ఏప్రిల్ నెలాఖరున వరంగల్లో రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. 

  • మార్చి 31 కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు దండలేసి  దండోరాతో నిరసన 
  • ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ వరకు ధరల పెంపులను నిరసిస్తూ జిల్లా కేంద్రాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ఉద్యమాలు
  • ఏప్రిల్ 7న సివిల్ సప్లయ్, విద్యుత్ సౌధ వద్ద ధర్నాలు