జూబ్లీహి ల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

జూబ్లీహి ల్స్ లో  కాంగ్రెస్ గెలుపు ఖాయం.. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  డాక్టర్ కోట నీలిమ

పద్మారావునగర్​, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్ కోట నీలిమ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ పదేళ్ల విధ్వంస పాలన, రెండేళ్ల వికాస పాలనకు మధ్య ఎన్నిక జరుగుతోందన్నారు. నవీన్ యాదవ్​ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.