
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన యాత్రను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు పార్టీ నేతలు ఆదివారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయభేరి బస్సు యాత్ర నిర్వహించాల్సి ఉంది.
ఆ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనాలి. అయితే, వివిధ కారణాలతో సభను వాయిదా వేస్తున్నామని, అక్కడ బస్సు యాత్రకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.