యువతకు పార్టీలో ప్రాధాన్యతనిస్తాం: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

యువతకు పార్టీలో ప్రాధాన్యతనిస్తాం: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: యువత, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత నిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి నాయకత్వంలో యువత సమస్యలపై యువజన కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ లో అనేక మంది యువ నాయకులు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని వివరించారు.