ఎబోలా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. కాంగో, ఉగాండా,దక్షిణాఫ్రికాలో మారణహోమం సృష్టిస్తున్న వైరస్..ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మన దేశంలోకూడా హెల్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ముంబై వంటి పట్టణాల్లో ఎబోలా అడ్వయిజరీ ప్రకటించారు.
ముంబైలోని సివిక్ ఆస్పత్రులలోని రెడిసెంట్ డాక్టర్లకు ఎబోలా అడ్వయిజరీ జారీ చేసింది బృహణ్ ముంబై కార్పొరేషన్. ప్రస్తుతం మన దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా ఎబోలాపై అవగాహన, ఒకవేళ వైరస్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు ప్రజలను అలర్ట్ చేయాలని కోరింది.
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడం, ఆరోగ్య కార్యకర్తలలో అవగాహన, అప్రమత్తత ,సంసిద్ధత ప్రాముఖ్యతను బీఎంసీ మార్డ్ నొక్కి చెప్పింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులలో నిరంతరం ముందుండి సేవలందిస్తున్న రెసిడెంట్ డాక్టర్లను, అవసరమైనప్పుడు నిఘా చర్యలు, ముందుజాగ్రత్త సన్నద్ధతా చర్యలు ,అంటువ్యాధి నియంత్రణ ప్రోటోకాల్‌ల విషయంలో ఆస్పత్రి యాజమాన్యాలకు ,ప్రజారోగ్య అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరింది బీఎంసీ.
