ఎండ కాలంలో చల్లదనం కోసం లస్సీ తాగితే బాగుండనిపిస్తది. అయితే, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడిపండ్లతో తయారు చేసిన లస్సీ అయితే ఇంకొంచెం తాగబుద్ది అయితది. అయితే ప్రతీసారి షాపులో ఏం కొంటాం. ఇంట్లనే తయారు చేస్కుంటే ఫ్రెష్ గా ఉంటది కదా. కానీ ప్రిపేర్ చేయడం రాదు కదా అనుకుంటున్నరా. ఇగో.. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి నోరూరించే లస్సీ తయారు చేసుకోండి.
కావాల్సినవి:
- మామిడి పండు- ఒకటి
- పెరుగు - 150 మిల్లీ లీటర్లు
- చక్కెర - 50 గ్రాములు
- నీళ్లు- ముప్పావు లీటర్.
తయారీ:
మిక్సీ జార్లో పెరుగు, మామిడిపండు గుజ్జు, చక్కెర వేయాలి. అందులో నీళ్లు పోసి గ్రైండ్ చేస్తే, నోరూరించే మ్యాంగో లస్సీ రెడీ. ఈ లస్సీని గ్లాసులో పోసి పైన మామిడిపండు ముక్కలు వేసుకొని తాగితే యమ్మీగా ఉంటది. చల్లదనం కోసం ఫ్రిజ్ లో తయారు చేసిన ఐస్ ముక్కలు జత చేయండి. ఎండ తాపం కనపకుండా ఒక్క గుటకతో కూల్ అయిపోతుంది బాడీ.
టేస్టీ కోసం ఐస్ క్రీం, బాదం ముక్కలు వేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది మ్యాంగో లస్సీ. ఇంటి దగ్గరే ఫేమస్ జ్యూస్ పాయింట్స్ ఇచ్చే లస్సీ మాదిరిగా చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు. మీరూ ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ ప్రిపేర్ చేసుకుంటారు.
