యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone) . అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ మూవీ ఈరోజు ( మే 28, 2026 ) థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో ‘బ్లాస్ట్’గా వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ కరాటే ఫ్యామిలీ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథేంటంటే?
అర్జున్, ఆయన భార్య అభిరామి, కూతురు నీల (ప్రీతి ముకుందన్) బయట ప్రపంచానికి చాలా సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కనిపిస్తారు. కానీ, ఈ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వింటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఈ ముగ్గురూ కిల్లర్ 'కరాటే మాస్టర్లే'. కూతురు నీలను చిన్నప్పటి నుంచే సమాజంలో ఒంటరిగా పోరాడేలా, ధైర్యంగా పెంచుతారు. అయితే, ఊహించని విధంగా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, లోకల్ గూండాతో ఈ ఫ్యామిలీకి గొడవ మొదలవుతుంది. తమ జోలికి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్స్‌ను ఈ సైలెంట్ అండ్ వయలెంట్ ఫ్యామిలీ ఎలా బ్లాస్ట్ చేసింది? అసలు ఆ గూండాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనేదే మిగతా ఇంట్రెస్టింగ్ స్టోరీ.
ప్లస్, మైనస్ ఇవే..
దర్శకుడు సుభాష్ కె రాజ్ రాసుకున్న క్యారెక్టర్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా, ఇందులో మహిళా పాత్రలను పవర్‌ఫుల్‌గా చూపించారు. : సాధారణ గృహిణిగా కనిపించే అభిరామి, ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు రౌడీల ఎముకలు విరగ్గొట్టే సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో ఆమె ఇచ్చే ట్విస్ట్ అల్టిమేట్ నిలిచిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆఫీస్ వేధింపులపై ప్రీతి ముకుందన్ తిరగబడే సీన్ యాక్షన్ అండ్ ఫన్‌తో అదిరిపోయింది. నేటి యువతులకు ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది.
రొటీన్ కథే అయినా..
యాక్షన్ కింగ్ వన్ మ్యాన్ షో లా చేశారు. వయసైనా తగ్గని గ్రేస్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ కింగ్ అర్జున్ కరాటే మాస్టర్ రోల్‌లో జీవించేశారు. చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా, ఇంట్లోనే రౌడీలను ఈ ఫ్యామిలీ ఇరగదీసే వినూత్నమైన స్టంట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయానికి దర్శకుడు కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల నరేషన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అలాగే కథ పరంగా చూస్తే ఇది మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ రివెంజ్ ఫార్ములానే. విలన్ ట్రాక్ కొన్ని చోట్ల ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
ALSO READ : బాక్సాఫీస్ వద్ద ‘జార్జ్‌కుట్టి’ ఊచకోత..
ఇక మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రూర్ (కేజీఎఫ్ ఫేమ్) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపిస్తాయి. ప్రదీప్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో చాలా షార్ప్‌గా ఉంది. ఓవరాల్‌గా, ‘బ్లాస్ట్ జోన్’ అనేది సరికొత్త క్యారెక్టరైజేషన్స్‌తో వచ్చిన ఒక పక్కా యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రొటీన్ కథే అయినా.. సెకండాఫ్‌లో టైట్ స్క్రీన్‌ప్లే, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం యాక్షన్ లవర్స్ ఈ వీకెండ్ థియేటర్లలో ఈ సినిమాపై కచ్చితంగా ఒక లుక్ వేయొచ్చు అన్నా అభిప్రాయాన్ని సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు..
