కుప్పకూలిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

కుప్పకూలిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

గడచిన రెండు రోజులుగా నేలచూపులు చూస్తున్న బంగారం ధరలకు ఇవాళ వెండి కూడా జతకట్టింది. దీంతో భారీగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు తగ్గాయి. ఇరాన్ విషయంలో అమెరికా దూకుడుగా వెళ్లటం ఈ క్రమంలో ఒమాన్ కి కూడా షాకింగ్ వార్నింగ్ ఇవ్వటంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లు మళ్లీ బేజారాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలో తగ్గిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలించటం మంచిది. 

మే28న బంగారం రేట్లు తగ్గాయి. మే 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.223 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 606గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 305గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 28, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 85వేలకు తగ్గింది. అంటే గ్రాము దాదాపుగా రూ.285 దగ్గర ఉంది.