కాంగ్రెస్ ఖాతాలో తొర్రూర్, జనగామ..లక్కీ డ్రాతో ఛైర్మన్లుగా శ్రవణ్, బాలమణి

కాంగ్రెస్ ఖాతాలో తొర్రూర్, జనగామ..లక్కీ డ్రాతో  ఛైర్మన్లుగా శ్రవణ్, బాలమణి

మెజారిటీ మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను కాంగ్రెస్ వశం అవుతున్నాయి. ఇప్పటికే జనగామ మున్సిపాలిటీని డ్రా పద్దతిలో కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇపుడు తొర్రూర్ మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకుంది. లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి తుణం శ్రవణ్ ను అదృష్టం వరించింది. శ్రవణ్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.  వైస్ చైర్మన్ డ్రా పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి సోమ రజినీ ఎన్నికయ్యారు.

జనగామ జిల్లా జనగామ మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ చైర్మెన్ అభ్యర్థికి మొత్తం 16 ఓట్లు రాగా...బిఆర్ఎస్ పార్టీ చైర్మెన్  అభ్యర్థిగోపగాని సుగుణాకర్ కూడా 16  ఓట్లు వచ్చాయి.  దీంతో అధికారులు లక్కీ డ్రా వేశారు. ఇద్దరి పేర్లు రాసి డ్రా తీశారు. దీంతో లక్కీ డ్రాలో  కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణిని అదృష్టం వరించింది.  వైస్ ఛైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి పర్వతాలు ఎన్నికయ్యారు. 

అటు మెదక్ జిల్లా జహిరాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో  మున్సిపల్ ఛైర్మన్ పదవి యూనస్  ఎన్నికయ్యారు.