యువతితో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..రిమాండ్ కు పంపిన పోలీసులు

యువతితో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..రిమాండ్ కు పంపిన పోలీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కృష్ణ కాంత్ పార్కు సమీపంలో ఈ నెల 20న నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని, ఏ ఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న యు.సాగర్  అసభ్యంగా తాకాడు. ఆ యువతి కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా వారి పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిజమేనని తేలడంతో కానిస్టేబుల్​ను రిమాండ్ కు తరలించారు.