మెల్‌బోర్న్: ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. స్పిన్నర్లకు పెద్ద పీట వేస్తూ 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. గత 12 టీ20ల్లో కనీసం చాన్స్ కూడా ఇవ్వని కూపర్ కనోలీకి జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యకరం.
వెన్ను నొప్పితో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఈ నెలాఖరున నిర్వహించే స్కానింగ్ రిపోర్ట్‌ను బట్టి అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది తేలుతుంది. కాలిపిక్క గాయాల నుంచి కోలుకున్న హాజిల్‌వుడ్, టిమ్ డేవిడ్‌ను తీసుకున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఈ నెల 31 వరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. వచ్చే నెల 11న ఐర్లాండ్‌తో, 13న జింబాబ్వేతో, 16న శ్రీలంకతో, 19న ఒమన్‌తో ఆసీస్ తలపడనుంది. ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనోలీ, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, మాథ్యూ కునేమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
