ఏటా 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు

 ఏటా 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు
  • సరైన వ్యాక్సిన్​తోనే నివారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘కాంకర్ హెచ్​పీవీ అండ్​ క్యాన్సర్ కాన్​క్లేవ్​ 2025’ ను  బేగంపేటలోని ఓ హోటల్​లో గురువారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో డాక్టర్​ త్రిపుర సుందరి మాట్లాడారు. హెచ్​పీవీ క్యాన్సర్ల నివారణకు క్యాంపెన్​ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ఇండియాలో మహిళల్లో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ ఉంటోందని, ఏటా 1.23 లక్షల కొత్త కేసులు, 77 వేల మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు. సరైన వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌తోనే నివారణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్​ డాక్టర్ లీల, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుధ, రేడియేషన్​ ఆంకాలజిస్ట్​ డాక్టర్ నివలిక రాజమోని, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్  పవన్ కుమార్  పాల్గొన్నారు.