జంట జలాశయాల పరిరక్షణ హైడ్రాకు

 జంట జలాశయాల పరిరక్షణ హైడ్రాకు

హైదరాబాద్, వెలుగు: జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ హైడ్రా చేతిలోకి వెళ్లింది. 1989 హెచ్ఎం డబ్ల్యూఎస్ చట్టంలో సెక్షన్ 81 ప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో హైడ్రాకు అప్పగించింది. ఇప్పటివరకు హెచ్ఎండబ్ల్యూఎస్ జంట జలాశయాల పరిరక్షణ బాధ్యత చూడ గా ఇప్పుడు హైడ్రా చూస్తుంది. దీంతో పాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీనీ ఏర్పాటు చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్​లో జంట జలాశయాలతో పాటు ట్విన్ సిటీలలో ఉన్న చెరువులు, కుంటలకు సంబంధించి హైడ్రా కమిషనర్ చైర్మన్​గా ఈ కమిటీ పనిచేయనుంది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 సెక్ష న్ 72, 99 ప్రకారం మున్సిపాలిటీల పర్యవేక్ష ణ, అధికారులను పిలిపించుకునేందుకు, ఎక్కడికైనా ఎంట్రీ అయ్యేందుకు హైడ్రాకు ప్రభుత్వం అధికారం కల్పించింది. నీటి వనరు లతో పాటు గ్రీన్ స్పేసెస్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏరియాల పరిరక్షణ హైడ్రాకు అప్పగించింది.

ఇందుకోసం ఆయా శాఖల నుంచి అధికారులను హైడ్రాకు డిప్యూట్ చేయనున్నారు. ఇరిగేషన్ యాక్ట్ లోనూ ప్రభుత్వం కల్పించిన అధికారాల ప్రకారం చెరువులు కబ్జా కాకుండా నియంత్రించుకునేందుకు ఆ శాఖ నుంచి ఒక అధికారిని నియమించుకునే అవకాశం ఉన్నది. దాని ప్ర కారం అధికారిని హైడ్రాకు కేటాయించి.. ఆ పవర్​ను కల్పించారు. రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్ ను హైడ్రాలో డిప్యూటేషన్​పై పంపేలా అధికారాలు ఇచ్చారు.