దళితబంధుతో మరోసారి దళితులను మోసం చేసే కుట్ర

దళితబంధుతో మరోసారి దళితులను మోసం చేసే కుట్ర

ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేసి.. భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసే కుట్ర ప్రభ్వత్వం చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇందిరమ్మ హయాంలోనే పక్కా ఇండ్లను తీసుకొచ్చిందన్నారు. 54 ఎకరాల కంటే ఎక్కువుంటే లాక్కొని అసైన్డ్ ల్యాండ్ గా ఏర్పాటు చేసి.. దళిత, గిరిజనులకు భూములు పంచిందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు రేవంత్. 

కేసీఆర్..హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంపిణీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు 10 లక్షలు ఇస్తామంటే..నిన్ను ఎవ్వరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలయ్యే విదంగా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెడితే.. దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామన్నారు ఈటల.

ట్యాంక్ బండ్ పక్కనే వున్న సెక్రటేరియట్ భూమిని, లేదంటే ప్రగతి భవన్ ను అమ్మి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదన్నారు. దళిత, గిరిజన దండోరా చేసి.. కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ప్రతి నియోజక వర్గంలో దళిత గిరిజనులు ర్యాలీలు తీయాలని పిలుపునిచ్చారు.అంతేకాదు..TRS ఎమ్మెల్యేలను నిలదీయాలని..10 లక్షలు ఇస్తావా, చస్తావా అని అడగాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్.. ఎమ్మెల్యేలు చస్తేనో, ఉప ఎన్నిక వస్తేనో నిధులు విడుదల చేయడని తెలిపారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో దళిత గిరిజన దండోరా మోగించాలన్నారు.

ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9న  దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఆ రోజు నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. దీనికి..అధిష్టానం దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.