గచ్చిబౌలి: డిస్కౌంట్ ఇయ్యాలని గన్ తో కానిస్టేబుల్ హల్చల్

గచ్చిబౌలి: డిస్కౌంట్ ఇయ్యాలని గన్ తో  కానిస్టేబుల్ హల్చల్

గచ్చిబౌలి, వెలుగు: బిల్లులో డిస్కౌంట్ ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద గన్‌‌‌‌‌‌‌‌తో హల్‌‌‌‌‌‌‌‌చల్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న వివేక్ డ్యూటీ ముగిసిన తర్వాత మంగళవారం అర్ధరాత్రి గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద ఉన్న ‘మెమోస్ డిలైట్’ ఫుడ్ కోర్ట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి మెమోస్ కొనుగోలు చేశాడు. బిల్లు రూ.170 అయ్యింది. అందులో డిస్కౌంట్ ఇవ్వాలని, తాను పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు చెందినవాడినని ఫుడ్ కోర్ట్ యజమానిని అడిగాడు.

అయితే ఐడీ కార్డు చూపించాలని యజమాని కోరగా, తన వద్ద ఐడీ కార్డు లేదని, గన్ బయటకు తీసి బెదిరించినట్లు సమాచారం. దీంతో ఫుడ్ కోర్ట్ యజమాని భయాందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ వివేక్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌‌‌‌‌‌‌‌తో బెదిరించిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.