- యాదగిరిగుట్టలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్
హుజూర్‌నగర్, వెలుగు : మైనర్‌ను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నాయిని అనిల్‌కుమార్ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి అనంతగిరి మండలం పాలరం గ్రామానికి చెందిన, తన బంధువైన బాలికతో వివాహం నిశ్చయమైంది.
మైనర్‌ను పెండ్లి చేసుకోవడం నేరం కావడంతో... ఈ నెల 9న అర్ధరాత్రి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి 1908కు ఫోన్ చేసి బాల్య వివాహంపై ఫిర్యాదు చేశాడు. సమాచారం
అందుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సారెడ్డి సోమమ్మ క్షేత్రస్థాయిలో విచారణ జరుపగా.. కానిస్టేబుల్ అనిల్‌కుమార్ మైనర్‌ను వివాహం చేసుకున్నట్లు నిర్ధారణ అయింది.
దీంతో ఐసీడీఎస్ ఆఫీసర్లు మంగళవారం రాత్రి హుజూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బాల్య వివాహానికి సహకరించిన వారితో పాటు పెండ్లి జరిపించిన పెద్దలపై సైతం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.
