
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
పంజాగుట్ట, వెలుగు: దేశంలోని వేర్వురు ప్రాంతాల్లో సెలఫోన్లు చోరీ చేసి, విదేశాలకు తరలిస్తున్న జార్ఖండ్, బిహార్, వెస్ట్‌బెంగాల్ కు చెందిన అల్మిన్గజి, మహ్మద్షాన్వాజ్, గోవింద్కుమార్మాతో, జుగేశ్వర్ నోనియా, జోనుకుమార్, ఎండీ ముక్తర్, ఓ మైనర్ ను పంజాట్ట పోలీసులు అరెస్టు చేశారు. 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుయార్ మంగళవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.
నిందితులు చోరీ చేసిన సెలఫోన్లను బంగ్లాదేశ్సరిహద్దుల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్ దొంగలకు ముగ్గురు పోలీసులు సహకరించినట్లు గుర్తించామన్నారు. గాంధీనగర్ పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్పి.సోమన్న, హోంగార్డు అశోక్, సైఫాబాద్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్సాయిరాం సెల్ఫోన్దొంగలకు సహకరించారని వెల్లడించారు. వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు.
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్కేసు దర్యాప్తును డీసీపీ వివరించారు. రాజకీయ నేతలను విచారిస్తున్నామని, సాక్ష్యాలు సేకరిస్తున్నామ తెలిపారు. ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారని, వారిని
ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.