రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశముంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశముంది..  కేటీఆర్  కీలక వ్యాఖ్యలు

రాజకీయ పార్టీల తీరుచూస్తుంటే.. రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశముందనిపిస్తుందన్నారు కేటీఆర్. అంబేద్కర్ కేవలం దళితులకే కాదని.. అందరికీ నాయకుడేనని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన  అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేటీఆర్. 

నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టామని,నూతన సచివాలయంకు ఆయన పేరే పెట్టుకున్నామన్నారు కేటీఆర్. అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు కేటీఆర్.  మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవేనని అన్నారు . సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.