కలుషిత ఆహారం తిని విద్యార్థినిలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని విద్యార్థినిలకు అస్వస్థత

మహబూబాబాద్: కురవి మండలం సిరోల్‎లోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‎కు తరలించారు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురవడంతో.. మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక ఆస్పత్రిలో వారిని పరామర్శించారు. విద్యార్థినుల ఆర్యోగ పరిస్థితి అడిగి తెలుసుకొని, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు.  విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు. మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం అయితే కఠిన చర్యలుంటాయని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్ గురుకులంలో టిఫిన్ చేశారు.