సనాతన్ ధర్మ అంశంపై ఎన్నికల్లో పోటీ చేయండి: డీఎంకేకు బీజేపీ నేత అన్నామలై సవాల్

సనాతన్ ధర్మ అంశంపై ఎన్నికల్లో పోటీ చేయండి: డీఎంకేకు బీజేపీ నేత అన్నామలై సవాల్

సనాతన ధర్మం అంశంపై వచ్చే ఎన్నికల్ల పోటీ చేయాలని డీఎంకే పార్టీకి  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సవాల్ విసిరారు. డీఎంకే సనాతన ధర్మాన్ని రద్దు చేయబోతోందని చెప్పి ఓట్లు అడగండి.. మేం సనాతన ధర్మాన్ని , మతాన్ని రక్షించుకుంటాం అని ఓట్లడుగుతాం.. ప్రజలు ఎవరిని సమర్థిస్తారో.. ఎవరికి ఓటేస్తారో చూద్దాం అని అన్నామలై అన్నారు.

ఎన్నో ఏళ్లుగా డీఎంకే ఆడుతున్న నాటకం మాకు తెలుసన్నారు అన్నామలై. అధికారంలోకి వచ్చిన ఏడాదికి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు. రెండో ఏడాది సనాతన ధర్మాన్ని రద్దు చేస్తామంటున్నారు. మూడో ఏడాది  సనాతన ధర్మాన్ని ఏకం అంతం చేయాలంటున్నారు.. ఇలా సనాతన ధర్మం దాడులు చేస్తూనే వస్తున్నారని అన్నామలై అన్నారు. 2024 ఎన్నికల్లో డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు.

సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో మరోవైపు సనాతన డీఎం కే నేత సనాతన ధర్మం వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. ధర్మం ఒక సామాజిక వ్యాధి అని .. కుష్టు వ్యాధి, హెచ్ ఐవీ కంటే ప్రాణాంతకమైందని డీఎంకే నేత ఏ. రాజా గురువారం అన్నారు. 

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం.. సనాతన ధర్మం వ్యతిరేకులకు గట్టి సమాధానం చెప్పాలని పిలుపునివ్వడం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన కూడా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వెనకేసుకొచ్చారు... ప్రధాని మోదీ నిజా నిజాలు తెలుసుకోకుండా అలాంటి పిలుపునివ్వడం సరికాదని ఎంకే స్టాలిన్ అన్నారు.