
తమను కూడా పర్మినెంట్ చేయాలని యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఓయూ క్యాంపస్ లో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లను, పాలిటెక్నిక్ లెక్చరలను పర్మనెంట్ చేసిన విధంగానే తమను కూడా పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. తమకు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని.. వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ:5 కోట్ల మంది రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీకి బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో పనిచేస్తూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో సుమారు 1500 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సర్వీసును గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరారు. లేని పక్షంలో డిపార్ట్మెంట్ పరంగా ఉద్యమిస్తామని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హెచ్చరించారు.