మామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన

మామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన

జ్యోతినగర్, వెలుగు: మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కోగిసర్ సునాని(48), రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్‌‌లోని బీ5/45 క్వార్టర్స్‌‌లో సివిల్ మెయింటనెన్స్‌‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా చేస్తున్నాడు. శుక్రవారం క్వార్టర్ లో మేస్త్రీ పనులు చేస్తుండగా లంచ్ టైమ్ లో  బిల్డింగ్ పైన మామిడి చెట్టు నుంచి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ  కిందపడి స్పాట్ లో చనిపోయాడు.

 మృతుడి కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.3.50 లక్షలు, అంత్యక్రియలకు రూ. 30 వేలు, కుటుంబంలో ఒక్కరికి జాబ్ ఇవ్వాలని , అదేవిధంగా.. వర్కర్ కు కాంపెన్సెషన్  వర్తిస్తే రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేదంటే కాంట్రాక్టర్ చెల్లించాలని లీడర్ల సమక్షంలో ఒప్పందం కుదిరింది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.