
హైదరాబాద్ లోని లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ... కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి... మినిమం టైమ్ స్కెల్ అమలు చేస్తూ... హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు మద్దతుగా అర్. కృష్ణయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ నిరసనలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేవరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని ధర్నా చేపట్టారు.
దీంతో పోలీసులకు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాలన్ని ఉద్రిక్తంగా మారాయి. కాగా లక్డీకపూల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.