పల్లె ప్రగతిపై కంట్రోల్ రూమ్

పల్లె ప్రగతిపై కంట్రోల్ రూమ్
  • నిత్యం సర్కారుకు రిపోర్టులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం స్టార్ట్ అయిన పల్లె ప్రగతి పై పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. హిమాయత్ నగర్ లోని పీఆర్ కమిషనరేట్​లో అన్ని జిల్లాల నుంచి పూర్తి వివరాలు వచ్చే వరకు డ్యూటీలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. 18 వరకు 15 రోజుల పాటు నిత్యం 8 మంది అధికారులు రెండు టీమ్ లుగా పనిచేయనున్నారు. ఈ టీమ్ లో సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉంటారు. 32 జిల్లాల నుంచి పల్లె ప్రగతి పై వివరాలు తీసుకొని రిపోర్టులు రెడీ చేసి అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.వీటిని సీఎంవో, మంత్రి, సీఎస్, పీఆర్ ఉన్నతాధికారులకు పంపనున్నారు.