బోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్

బోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాలలో ప్రస్తుతం  నివసిస్తున్న లేదా చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేయనుంది. ఈ మేరకు  సంబంధిత ఆఫీసర్ల నెంబర్లను వెల్లడించింది. ఈ నెంబర్లను సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్  కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

సంప్రదించాల్సిన కంట్రోల్ రూమ్‌ నెంబర్లు:

  • ఢిల్లీలోని తెలంగాణ భవన్ ల్యాండ్‌లైన్: 011-23380556
  • వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ – 9871999044
  • హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు – 9971387500
  • జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – 9643723157
  • సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 9949351270.