ఇవాళ మరోసారి వీసీని కలుస్తాం

ఇవాళ మరోసారి వీసీని కలుస్తాం

రాహుల్ గాంధీ ఓయూ టూర్ పై రాష్ట్రంలో రచ్చ కంటిన్యూ అవుతోంది. OUలో రాహుల్ ముఖాముఖిపై పర్మిషన్ లేదని అధికారపార్టీ చెప్తుంటే.. రాహుల్ ఓయూ విద్యార్థులను కలిసే వెళ్తారంటున్నారు హస్తం పార్టీ నేతలు. తెలంగాణ ఇచ్చిన పార్టీకే పర్మీషన్ ఇవ్వరా అంటూ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  NSUI ఆధ్వర్యంలో నిన్న వీసీ చాంబర్ ను ముట్టడించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. బల్మూర్ వెంకట్ తో సహా.. పలువుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి ఉండి తీరుతుందని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. ఇవాళ మరోసారి వీసీని కలుస్తానని చెప్తున్నారు. మే 6న వరంగల్ లో రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ రానున్నారు. అదే రోజు ఓయూ విద్యార్థులతో ముఖాముఖికి కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే వీసీ పర్మీషన్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నిరసన చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతో టీఆర్ఎస్ సర్కార్ పర్మీషన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

వీసీ చాంబర్, మినిస్టర్స్ క్వార్టర్ ముట్టడికి యత్నించిన విద్యార్థినేతలను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. అక్రమంగా అరెస్ట్ చేసిన వారందర్నీ వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు PCC చీఫ్ పిలుపునిచ్చారు. ఓయూ ఎవరి జాగీరు కాదంటూ.. రాహుల్ పర్యటనను అడ్డుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. మరోవైపు  ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతివ్వాలని కోరుతూ హై కోర్టులో ఓయూ జేఏసీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేవారు. ఇవాళ దీనిపై కోర్టు విచారించనుంది.