లక్షద్వీప్‌‌లో స్కూల్ యూనిఫాంపై వివాదం

లక్షద్వీప్‌‌లో  స్కూల్ యూనిఫాంపై వివాదం

కవరట్టి: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌‌లో స్కూళ్లకు కొత్త యూనిఫామ్ అమలు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదంగా మారాయి. ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫామ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని లక్షద్వీప్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హమ్దుల్లా సయీద్ శనివారం ఆరోపించారు.బాలికలు ధరించే హిజాబ్‌‌లు లేదా స్కార్ఫ్‌‌లపై క్లారిటీ లేకుండా కొత్త డ్రెస్ కోడ్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. లక్షద్వీప్ సంస్కృతిని, జీవనశైలిని దెబ్బతీసేలా  కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కొత్త స్కూల్ యూనిఫామ్ పై విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించలేమని స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై విద్యార్థులతో సహా భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.